దమ్ముంటే అరెస్టులు చేసుకోవాలని చెవిరెడ్డి, అంబటి టీడీపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. తాము ముందస్తు బెయిల్స్ కూడా తీసుకునేది లేదని అంటున్నారు. చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో కేసు పెట్టారు. ఓ స్కూల్ విద్యార్థినిపై ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా గ్యాంగ్ రేప్ చేశారని ఆయన ప్రచారం చేశారు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు పెట్టారు. తర్వాత బాలిక తండ్రితో చెవిరెడ్డి ఒప్పందానికి వచ్చి.. తాను ఫిర్యాదు చేయించలేదని మీడియాతో చెప్పించారు. కానీ అప్పటికే కేసు నమోదు అయిపోయింది. దాంతో ఆయన తనపై కేసు కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారు.
విచారణ జరిపిన హైకోర్టు కేసు కొట్టేసేందుకు నిరాకరించింది. అరెస్టు చేయకుండా కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో చెవిరెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుంది. తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆ బాలిక తండ్రి పిలిస్తేనే వెళ్లానని చెబుతున్నారు. ముందదస్తు బెయిల్ తీసుకోనని కావాలంటే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తానని అంటున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేయకుండా ఉంటారా.. చేస్తే తేలుస్తానన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మరో వైపు అంబటి రాంబాబు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.
తనపై కేసులు పెట్టారని.. వాటిలో అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ముందస్తు బెయిల్ కు వెళ్లనని క్వాష్ పిటిషన్లు వేయనని ఆయనంటున్నారు. ఇలా వైసీపీ పెద్ద మనుషులందరూ.. ఇలా అరెస్టు చేసుకోమని సవాల్ చేస్తున్నారు. ఒక వేళ్ల వీళ్ల సవాల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకుంటే.. మళ్లీ పొన్నవోలు ప్రభాకర్ రెడ్డి లాయర్ కోటు తీసుకుని కోర్టుల వద్దకు పరుగెత్తుకు రావాల్సి ఉంటుంది. అయినా పోక్సో కేసులో చెవిరెడ్డి అరెస్టును తప్పించుకోవడం అంత తేలిక కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.