వైసీపీ తరపున ఏ కార్యక్రమం చేయాలన్నా.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలయినా సరే దగ్గరుండి చూసుకునే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముందుగానే బుజ్జగించేశారు. ఆయనకు పదవి లేదని ముందుగానే సంకేతాలు పంపేశారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన… మిగతా వాళ్ల సంగతేమో కానీ జగన్ తనపై చల్లని చూపుచూస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ప్రస్తుతం ఉన్నతుడా చైర్మన్ పదవినే మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు.
దీంతో ఆయనకు ఇదే ప్రాప్తం అని సరి పెట్టుకోవాల్సి వచ్చింది. చెవిరెడ్డి సీఎం జగన్ కు చెందిన వ్యక్తిగత వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. ఆయన ఇల్లు సహా ఇంటి పక్కన కుటీరం నిర్మించడం వరకూ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అలాగే… చినజీయర్ స్వామితో మంచి సంబంధాలు ఉండేలా ఆయనే చూసుకుంటారు. ఇటీవల సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ వేడుకల్లోనూ ఆయన ఉన్నారు. అదేసమయంలో జగన్ తో పాటు మొదటి నుంచి ఉన్న నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
చివరికి ఆయనకు పదవి దక్కకపోవడంతో ఆయన నిరాశ చెందుతారేమోకానీ అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితిలేదు. మరో పార్టీలో ఆయన ఉండలేరు. ఆయనను ఇతరపార్టీలు స్వాగతించే పరిస్థితి లేదు. అయితే ఎవరినీ బుజ్జగించేది లేదన్న సజ్జల… చెవిరెడ్డికి ముందుగానే పదవి ప్రకటించడం ద్వారా బుజ్జగింపులు ఉంటాయని చెప్పకనే చెప్పారంటున్నారు.