చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తాను కేసు పెట్టలేదని ఓ బాలిక తండ్రితో వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టించారు. కేసు పెట్టిన వారం తర్వాత ఆయనను వైసీపీ నేతలు తీసుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి ప్రకటన చేయించడంలోనే ఇందులో ఉన్న రాజకీయం అర్థమవుతుంది. ఇందుకోసం చెవిరెడ్డి చాలా ఖర్చు పెట్టారని చంద్రగిరిలో చెప్పుకుంటున్నారు.
కొద్ది రోజుల కిందట ఓ బాలిక స్కూల్ నుంచి వస్తూండగా దారిలో ఎవరో దాడి చేశారు. ఆ ఘటనను వైసీపీ నేతలు రాజకీయంగా వాడుకున్నారు. చెవిరెడ్డి నుంచి రోజా వరకూ అందరూ ఆ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారు. కానీ ఆ బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వైద్య పరీక్షల్లో తేలింది. అంతే కాదు అసలు తన మిత్రుడితో వచ్చిన గొడవ వల్ల ఆ పాక్ నాటకం ఆడిందని కూడా పోలీసులు గుర్తించారు.
పాపను ఆస్పత్రిలో చేర్పించినప్పుడే ఆ పాప తండ్రి తన కూతురు భవిష్యత్ పై ప్రభావం చూపేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీడియా ముందు మండిపడ్డారు. ఎలాంటి అఘాయిత్యం జరగకపోయినా జరిగిందని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రకారం కేసు మొత్తం సెటిలైపోయిన తర్వాత పోలీసులు తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోక్సో కేసు పెట్టారు. దీనిపై చెవిరెడ్డి నాలుగు రోజుల కిందట స్పందించారు. తాను ముందస్తు బెయిల్ తీసుకోనని..పోలీసులకు సవాల్ చేశారు.
అందులో అర్థమేంటో మూడు రోజుల తర్వాత స్పష్టమైంది, చెవిరెడ్డి వర్గం.. బాలిక తండ్రితో టచ్ లోకి వెళ్లి తిరస్కరించలేనంత ఆఫర్ ఇచ్చి.. తాను కేసు పెట్టలేదని ప్రెస్ మీట్ పెట్టించుకున్నారు. కానీ పోలీసులు ఇంతటితో వదిలేస్తారా అన్నదే అసలు టాపిక్.