వైసీపీ అధినేత జగన్ చేసే రాజకీయాలు ఎంత సిల్లీగా ఉంటాయో మరోసారి ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలను చూసి ఎటు పోతున్నామని వెదుక్కుంటున్నారు. తాజాగా ఆయన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేశారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు లేదు కానీ.. జిల్లా వైసీపీని చక్కదిద్దాలని ఆయనకు జగన్ టాస్క్ ఇచ్చేశారు. ఈ విషయం తెలిసి జిల్లా వైసీపీ నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. మా జిల్లాలో మగాళ్లు లేరా.. ప్రకాశం వైసీపీ గొడ్డుబోయిందా అని మండిపడుతున్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాకు సంబంధం లేదు. ఆయన ఏమైనా పెద్ద లీడరా అంటే… అందరికీ ఏదో ఓ రూపంలో డబ్బులో… వస్తువులో సాయం చేసి.. గెలిచేద్దామనుకునేరకం. జనంతో టచ్ లో ఉండరు కానీ.. జగన్ ను మాత్రం బాగా ఆకట్టుకుంటారు. అందుకే ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన తన సొంత జిల్లా తిరుపతికి వెళ్లిపోతారేమో అనుకున్నారు. కానీ ప్రకాశం జిల్లా నేతగానే స్థిరపడిపోవాలని డిసైడైపోయారు. జగన్ కూడా అదే అనుకుంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, భూమన రెడ్డి వంటి వారు ఉన్నారు కాబట్టి చెవిరెడ్డిని ప్రకాశం జిల్లాలో అకామిడేట్ చేస్తున్నారు.
ఇప్పుడు ప్రకాశం వైసీపీ నేతలు చాలా ఫీల్ అవుతున్నారు. తమ జిల్లా గొడ్డుబోయిందా అని బాలినేని కూడా బహిరంగంగానే అంటున్నారు. అసలు చెవిరెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి బాలినేని అంగీకరించలేదు కానీ తప్పలేదు. ఇప్పుడు ఆయనకు సంబంధం లేదని జిల్లాకు ఆయనను అధ్యక్షుడ్ని చేస్తే ఇక ఊరుకునేది లేదని అంటున్నారు. మిగతా వారు కూడా అదే పరిస్థితుల్లోఉన్నారు. చెవిరెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే.. సగం మంది నేతలు క్యాడర్.. జంప్ ఖాయమన్న వాదన వినిపిస్తోంది.