ఆంధ్రజ్యోతి పత్రిక అంటే వైసీపీ వారికి గిట్టదు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతిని శత్రువుగా భావిస్తారు. ఆ పత్రికకు రూపాయి కూడా ప్రకటనలు ఇవ్వరు. పార్టీ తరపున ఇవ్వరు. ప్రభుత్వం తరపున అసలే ఇవ్వరు. తమకు.. రూ. రెండు వందల కోట్ల మేర నష్టం జరిగిందని ఇటీవల ఓ వారాంతపు ఆర్టికల్లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా ఫీలయ్యారు అది వేరే విషయం. అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో ఆంధ్రజ్యోతిలోనూ వైసీపీ ప్రచారానికి సంబంధించి ఆ పార్టీ నేతలు ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు ఈ ప్రకటనలు ఇస్తున్నారు. సాక్షి పత్రికలో జగన్కు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ … వ్యక్తిగత హోదాలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన చెవిరెడ్డి అదే చేత్తోల ఆంధ్రజ్యోతి పత్రికకు కూడా ఇచ్చారు. సేమ్ డిజైన్తో జగన్కు శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికను జగన్ చూస్తారో లేదో కానీ.. ఆయన మాత్రం తరచూ ప్రకటనలు ఇస్తున్నారు. జ్యోతి పత్రికకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదనేది జగన్ విధానం. అయినప్పటికీ చెవిరెడ్డి ఆయన ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో.. కానీ జగన్ కూడా అభ్యంతరం చెప్పకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
చెవిరెడ్డి విషయంలో ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా అంత వ్యతిరేకంగా ఉండరు. చెవిరెడ్డి .. రూ. కోట్లు ఖర్చు పెట్టి వివిధ రకాల సాయాలు చేస్తూంటారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సరుకులు పంపడం లాంటివి చేస్తూంటారు. వారికి ఆంధ్రజ్యోతి పబ్లిసిటీ ఇస్తుంది కానీ.. అంత సొమ్ము ఆయనకు ఎక్కడి నుంచివస్తుందని ఒక్క సారి కూడా ప్రశ్నించలేదు. ఆ కృతజ్ఞత ఉందో లేకపోతే.. వైసీపీ నుంచి ఎవరో ఒకరు ఆర్కేతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం మంచిదని అనుకున్నారో కానీ.. చెవిరెడ్డి మాత్రం అప్పుడప్పుయినా ఆంధ్రజ్యోతికి ప్రకటనల రూపంలో ఎంతో కొంత ఆదాయం తెచ్చి పెడుతున్నారు.