తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ టీవీ చానల్ లో కూర్చుని జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన జోస్యాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.గతంలో ఆయన చెవిరెడ్డి సర్వేలను నమ్ముకున్నారు. ఆయనను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టుకుని మరీ అంచనాలు తెప్పించుకుని ఆ లెక్క ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. వంద సీట్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ తో వెళ్లి బొక్క బోర్లా పడ్డారు.
అసలు ఓడిపోతారని అనుకోలేదు. కానీ ఓడిపోయారు. ఇప్పుడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అతి కష్టం మీద మెదక్ సీటును గెలిచే చాన్స్ ఉంది. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఆ సీటు కూడా కష్టమేనని చెబుతున్నారు. పోరాటం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. కేటీఆర్ కార్యకర్తల సమావేశం పేరుతో ఇండోర్ మీటింగ్ లు తప్ప ఒక్క బహిరంగసభ ఏర్పాటు చేయలేకపోయారు. పార్టీకి ఉనికి లేదని అందరూ వెళ్లిపోతున్నారు. అయినా ఇప్పటికే ఎనిమిది నుంచి పన్నెండు సీట్ల లెక్క చెప్పుకుంటున్నారు. చెవిరెడ్డి నివేదికలు మళ్లీ తెప్పించుకున్నారేమో కానీ.. జగన్ గెలుస్తారని అంటున్నారు.
జగన్ గెలవాలనేది కేసీఆర్ కోరిక. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ ఉంటే… తన పరిస్థితి ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే… కేసీఆర్ అధికారం అడ్డం పెట్టుకుని వీరిద్దర్నీ వేధించినంతగా ఎవర్నీ వేధించలేదు. ఇప్పుడు వారి చేతుల్లోనే అధికారం ఉంటే తనను వదిలేస్తారని అనుకోరు. కనీసం అక్కడ జగన్ అయినా అధికారంలో ఉండాలని ఆయ.న ఆశపడుతున్నారు. కానీ తనే ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా గెలుస్తాడని కేసీఆర్ కూ తెలుసు.
నిజంగా తెలంగాణలో కేసీఆర్ పన్నెండు లోక్ సభ సీట్లు గెలిచేంత వాతావరణం ఉన్నట్లయితే.. ఏపీలోనూ జగన్ గెలిచే వాతావరణం ఉన్నట్లే.కానీ బీఆర్ఎస్ ను ప్రజలు ఇప్పుడు మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఏపీలో జగన్ పరిస్థితి అంతే. రాజకీయ భూచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని నిరూపిస్తూనే ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసే ఘన కార్యాలకు ఫలితం అనుభవించేలా చేస్తూనే ఉంటుంది.
యుక్తులు.. ఇవన్నీ మహేష్ క్యారెక్టర్లో ప్రతిబింబిస్తాయని తెలుస్తోంది. అలాగని ఈ కథకూ, పురాణాలకూ ఎలాంటి సంబంధం లేదు. కేవలం రాజమౌళి రిఫరెన్స్ కోసం మాత్రమే హనుమాన్ క్యారెక్టర్ని తీసుకొన్నార్ట. కేవలం మహేష్ క్యారెక్టర్ అనే కాదు, మిగిలిన పాత్రలకూ ఇలాంటి రిఫరెన్సులు కనిపిస్తాయని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయ్యింది. మహేష్ లుక్ పై కూడా రాజమౌళి ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మిగిలిన నటీనటుల కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. ఈ సినిమా ప్రకటన కోసం ఓ కాన్సెప్ట్ టీజర్ రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.