ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని చంపేందుకు పక్కా ప్లాన్ చేసిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. పోలింగ్ ముగసిన తర్వాత స్ట్రాంగ్ రూముని పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి ప్లాన్ ప్రకారం దాడి చేశారు. కారు కెమెరాల్లో అవి నమోదయ్యాయి. దీనిపై కలకలం రేగడంతో అప్పట్లో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కానీ ఈ దాడికి అసలు సూత్రధారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తర్వాత దర్యాప్తులో తేలింది. కాల్ రికార్డుతో పాటు ఆయన దాడి సమయంలో ఎస్వీయూ దగ్గరే ఉన్నారని ఆధారాలు దొరికాయి. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మోహిత్ రెడ్డి దాఖలు చేశారు. కోర్టు తిరస్కరించింది. అప్పట్నుంచి ఆయన కనిపించడం లేదు. తన కుమారుడ్ని అరెస్టు చేస్తారని తెలిసిన తర్వాత చెవిరెడ్డి .. అసలు పులివర్తి నానికి గాయాలు కాలేదంటూ కొత్త నాటకాలు ప్రారంభించారు.
Also read : వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి !
అయితే మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. బెంగళూరులో ఉన్నట్లుగా తెలియడంతో వెళ్లి అరెస్టు చేశారు. తిరుపతి కోర్టులో ఆయనను ప్రవేశ పెట్టి జైలుకు పంపే అవకాశం ఉంది. పులివర్తి నానిపై దాడి సమయంలో .. ఆయన గన్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి.