వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి నిన్న నెల్లూరు సెంట్రల్ జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పోలీసులతో దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేయబడటంతో కొన్ని రోజుల క్రితం పోలీసులు ఆయనని అరెస్ట్ చేసారు. తిరుపతి విమానాశ్రయ మేనేజర్ తో దురుసుగా వ్యవహరించినందుకు ఆయనతో బాటు వైకాపా ఎంపి మిదున్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో మిదున్ రెడ్డికి కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది. తెదేపా ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.