సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. అయితే.. ‘గేమ్ ఛేంజర్’ వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సివచ్చింది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు పాటలు తీస్తే చాలు అనుకొన్నారు. ఓ పాట పూర్తయ్యింది. మరో పాట బాకీ. అయితే ఇప్పుడు టాకీ కూడా బాలెన్స్ ఉందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో కొన్ని ఎమోషన్ సన్నివేశాల్ని తెరకెక్కించాల్సివుందని టాక్. ఈవారంలో ఆయా సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసే అవకాశం ఉంది. దాంతో పాటు.. మిగిలిన పాటనీ కంప్లీట్ చేస్తారు. దాంతో షూటింగ్ పూర్తి అవుతుంది.
మార్చి తొలివారంలో `విశ్వంభర` నుంచి తొలి గీతం విడుదల అవుతుంది. అక్కడ్నుంచి వరుసగా పాటల్ని బయటకు వదులుతారు. విశ్వంభరకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా మెల్లగా మొదలు కానున్నాయి. హిందీ రైట్స్ రూ.38 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి డీటైల్స్ బయటకు రావల్సివుంది. ఓటీటీ బేరసారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, నీహారిక గెస్ట్ రోల్స్ చేస్తున్నారని, ఓ పాటలో ఇద్దరూ మెరవబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. అంతే కాదు… ఈ చిత్రంలో ప్రత్యేక గీతం ఉంది. అందులో నటించేవాళ్లు ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.