ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహించే గ్రీవెన్సెస్ల విషయంలో సత్వర పరిష్కారానికి ప్రయత్నించే బృందానికి చీఫ్ డాక్టర్ కన్నారావు. ఏపీ సీఎంవోలో చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్గా ఆయనది కీలక పాత్ర. ప్రజలు ఎవరైనా తాము ఇచ్చిన ఆర్జీకి పరిష్కారం రాలేదనుకుంటే.. తనకు మెసెజ్ చేయాలని చెబుతారు. పరిష్కారం చూపుతారు కూడా.
డాక్టర్ సి చిన్నారావు సీఎంవోలో గ్రీవెన్స్ ఆఫీసర్ గా దాకా ఎదగడం ఆషామాషీగా జరగలేదు. అంతా ఆయన కృషి , పట్టుదల.. సమాజం పట్ల ఆయనకు ఉన్న సానుకూల భావన వల్లే ఈ స్థానానికి వచ్చారు. చిన్నారు తండ్రి పాలేరుగా చేసేవారు. ఆయనను చదివించడానికి తండ్రి చాలా కష్టాలు పడ్డారు. ఫీజుల కోసం .. తన తండ్రి ఎంత కష్టపడేవారో.. తనకు చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చిన సందర్భంలో సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు.
గ్రీవెన్స్ విషయంలో ఆయన ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటారో… సమాజం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అందే పట్టుదలగా ఉంటారు. చిన్నారావు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. తనకు తెలిసిన దాన్ని .. సమాజానికి ఉపయోగపడుతుందనుకుంటే పది మందికి వెంటనే పంచుకుంటారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నో సామాన్య ప్రజలకు విలువైన విషయాలు పోస్టు చేస్తూంటారు.
పేద ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ఉన్న చిన్నారావు.. చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. సమస్య పరిష్కరమవలేదని ఎవరూ నిరాశపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు.