అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్రబృందం ప్రమోషన్లను మెల్లమెల్లగా స్పీడప్ చేస్తోంది. ఈనెల 22న ఆడియో ఫంక్షన్ జరపబోతున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ.. సైరా షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల చిరు రావట్లేదని తేలింది. సూర్య ఆడియో ఫంక్షన్‌కి అందుబాటులో ఉండననే ఉద్దేశంతోనే ఆదివారం సూర్య సెట్లో అడుగుపెట్టి… తన అభినందనలు తెలియజేసి వెళ్లిపోయారు. చిరు గైర్హాజరీతో సూర్యకి గెస్ట్ ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభాస్ కోసం ప్రయత్నించినా… తను ఆ టైమ్‌లో దుబాయ్‌లో ఉంటాడు. ఒక్కరోజు కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తాడా? అన్నది డౌటు. మొత్తానికి సూర్యకి గెస్టులెవరూ అందుబాటులో లేకుండా పోయారు. ప్రభాస్ ‘ఫర్లేదు డార్లింగ్ వచ్చేస్తా..’ అంటే బన్నీకి ఓ సమస్య తీరిపోయినట్టే. లేదంటే గెస్టులు లేకుండానే ఈ ఫంక్షన్ జరిపించేయాలి.