చిలుకూరి ఆలయ పూజారి రంగరాజన్ కు చంద్రబాబు అంటే కోపం. అసలు సందర్భం లేకపోయినా చంద్రబాబుపై ఎన్ని సార్లు విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు. తిరుమల విషయంలో ఎంత విషం చిమ్మాలో అంతా చిమ్ముతారు. అదే సమయంలో వైసీపీ అధికారలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు అంతా మంచిగానే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఆయన ఏపీ వ్యవహారాల్లోనూ వేలు పెట్టాలనుకుంటున్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న సత్యనారాయణను ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో రామచంద్రమోహన్ అనే అధికారిని నియమించారు. అయితే దేవాదాయ శాఖ కమిషనర్ పోస్టు నుంచి పోతే ఏదో ట్రెజరీ మిస్ అవుతుందన్నట్లుగా సత్యనారాయణ తన పదవిని కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చిలూకూరు బాలాజీ టెంపుల్ పూజారితోనూ లేఖ రాయించారు. ఇంకా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
అయన అయితేనే దేవాదాయశాఖలో అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిస్తున్నారు. ఆయన కంటే మరొకరు సమర్థులు లేనట్లుగా ఉంటున్నారు. వైసీపీ హయాంలో రామచంద్రమోహన్ అనే అధికారిని టార్చర్ పెట్టారు. ఆయన విజయనగరం జిల్లా టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు సన్నిహితుడు. అయితే రామచంద్రమోహన్ కోసం ఆయన సిఫారసు చేసే అవకాశం లేదు కానీ వైసీపీ బాధితుడిగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. కానీ సత్యనారాయణ వదిలేది లేదని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆయన జూన్ లో రిటైర్ అవుతారు. వేరే పోస్టింగ్ ఇచ్చినా దేవాదాయశాఖను వదలడం లేదంటే..ఏదో పెద్ద కథ నడుపుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయన్న గుసగుసలు సెక్రటేరియట్ లో వినిపిస్తున్నాయి.