ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం ఉంటుంది. ఓ ఘటనతో ఇద్దరూ కొట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే ఇలా కొట్టుకుంటే తమకు నష్టం జరుగుతుందని ప్రజలు నష్టపోతారని.. వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ ఇద్దరిలో ఒకడిపై కోపం.. మరొకడ్ని తన గ్రిప్ లో ఉంచుకోవాలన్న ఫ్రెండ్ మాత్రం.. మితృత్వం నటిస్తూ.. గ్రిప్‌లో ఉంచుకోవాలనుకున్న ఫ్రెండ్ ను రెచ్చగొడతాడు. నీకు ఇలా జరగకూడదని.. అదని.. ఇదని చెప్పి కోపం పెంచుతాడు. కావాలంటే ఆ కొట్లాటలో తన మిత్రుడికి అవసరమైన అరకొర సాయం కూడా అప్పు ఇస్తాడు. ఇద్దరూ కొట్టుకుంటూంటే..తన పని తాను చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లు వ్యక్తులే కాదు..దేశాలు కూడా ఉంటాయి. అలాంటిది చైనా.
పెహల్గాం ఉగ్రదాడిపై చైనా ఇంత వరకూ వ్యతిరేకంగా ఎక్కడా .. మనస్ఫూర్తిగా స్పందించలేదు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం సానుభూతి చూపిస్తున్నట్లుగా నటిస్తోంది. ఆ దేశానికి ఏదైనా ఆయుధ సాయం కావాలంటే అప్పుగా ఇస్తామన్న సంకేతాలను పంపుతోంది. పాకిస్తాన్ మైండ్ సెట్ వేరు. తమ ప్రజలు చనిపోయినా.. వారు ఆకలితో అలమటించినా పెద్దగా పట్టించుకోరు. పొరుగుదేశంపై కుట్రలు చేస్తే అదే తమ కడుపు నింపుతుందని అనుకుంటారు. చైనా కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పాకిస్తాన్ ను తనకు అనుకూలంగా భారత్ పై కుట్రలు చేసేందుకు ఉపయోగించుకుంటోంది.
పాకిస్తాన్ ఇప్పటికే చైనా రుణఊబిలో ఉంది. దీనికి కారణం బలూచిస్తాన్ లో చైనాకు ఉన్న ప్రాజెక్టులు. సిల్క్ రోడ్ తో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులను చైనా.. ఆ ప్రాంతం నుంచి చేపట్టింది. ఇందుకోసం పాకిస్తాన్ కు భారీగా ఆర్థిక సాయం చేస్తోంది. తమ గ్రిప్ నుంచి ఎప్పటికీ బయటకు పోకూడదన్న కోణంలో ఆయుధాల వంటి అప్పులు ఇస్తోంది. దీని వల్ల చైనాకు డబుల్ ప్రయోజనం ఉంటుంది. భారత్ ను దెబ్బతీయడం కూడా.. పాకిస్తాన్ ద్వారా చేయాలని అనుకుంటోంది.
ఓ వైపు పాకిస్తాన్ ను క్రమంగా ఆక్రమిస్తూ వస్తున్న చైనా..భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసింది. కొద్ది కొద్దిగా ఆక్రమిస్తూ వస్తోంది. భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితులు దృష్టి మరల్చి.. మరితంగా కబ్జా చేయాలన్న ఆలోచనలో చైనా ఉంది. అందుకే.. పాకిస్తాన్ ను పావుగా వాడుకుంటోంది. పాకిస్తాన్ ఇప్పుడు చైనా గుప్పిట చిక్కి ఉంది. అందుకే భారత్ ఉపేక్షించకూడదన్న వాదన వినిపిస్తోంది.