మార్చి 14 ఆవిర్భావ సభ తర్వాత తెలుగుదేశం పార్టీపై వరుస విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కలుస్తాడనిసంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రేపు ప్రసారం కానున్న ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేస్తూ నిమ్మకాయల చినరాజప్ప, పవన్ను బీజేపీ మార్చేసిందనే అనుమానం తమకు ఉందని సంచనల వ్యాఖ్య చేశారు. అలాగే పవన్లో స్థిరత్వం, పట్టుదల లేవని ఆయన అభిప్రాయపడ్డారు, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే భవిష్యత్తులో టీడీపీతో కలిసే అవకాశాలు లేకపోలేదని నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై, తెలుగుదేశం నాయకులపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం మాత్రం సంయమనం పాటిస్తున్నట్టు అర్థం అవుతోంది. గతంలో లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పై ఇదే తరహాలో పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనను విమర్శిస్తున్న ప్పటికీ తనకు మాత్రం పవన్ కళ్యాణ్ పై గౌరవం అలాగే ఉంటుందని లోకేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్పమాటలు కూడా ఇదే తరహాలో సాగడం గమనార్హం .