చిరంజీవి 150వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రైతుల సమస్యలు… వాళ్ల కోసం కథానాయకుడు చేసే పోరాటం ఈ చిత్ర ఇతివృత్తం. క్లైమాక్స్‌లో భారీ డైలాగులు ఉంటాయి. ఒక విధంగా డైలాగ్ ఓరియెంటెడ్ క్లైమాక్స్ ఇది. తమిళంలో విజయ్ ‘కత్తి’లాంటి డైలాగులు చెప్పి శభాష్ అనిపించుకొన్నాడు. ఆ ఎమోషన్ క్లైమాక్సే చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. తెలుగులోనూ పతాక సని్నవేశాలు ఆ స్థాయిలోనే ఉంటాయట. ఠాగూర్‌లో కోర్టు సీనుని తలపిస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఆల్రెడీ క్లైమాక్స్ వెర్షన్ డైలాగులూ రెడీ అయిపోయాయి. కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, గోపాల గోపాల సినిమాల్లో శక్తిమంతమైన సంభాషణలతో ఆకట్టుకొన్న యువ రచయిత బుర్రా సాయిమాధవ్.. ఇప్పుడు కత్తి సినిమా క్లైమాక్స్ పార్ట్ డైలాగులు రాసినట్టు సమాచారం.
కత్తి సినిమాకి ఇద్దరు ముగ్గురు రచయితలు పనిచేస్తున్నారు. వాళ్లలో బుర్రా సాయిమాధవ్ కూడా ఉన్నారు. బుర్రాకి ఎమోషనల్ పార్ట్ అప్పగించారట. ముందుగా క్లయిమాక్స్ సీన్స్ రాస్తే.. ఆ సంభాషణలు చిరుకి విపరీతంగా నచ్చాయని టాక్. దాదాపు 20 పేజీల డైలాగుల్ని చిరు చేత పలికించబోతున్నారు. పేపర్ పై ఉన్న ఎమోషన్ తెరపై పండితే… క్లయిమాక్స్ అదిరిపోవడం ఖాయమంటున్నారు చిరు కాంపౌండ్ వర్గాలు. చిరు అభిమానులకు కావల్సింది అదే కదా?