చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఫిక్స్ అయింది. ఇటీవలే అనిల్ రావిపూడి చిరంజీవికి ఫైనల్ నరేషన్ చెప్పారు. మెగాస్టార్ పచ్చజెండా ఊపేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మరింతగా జోరందుకున్నాయి. అనిల్ రావిపూడి తనకి అలవాటైన టెక్నీషియన్స్ తోనే ఈ ప్రాజెక్టు చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరు అనేదే అసలు సమస్య. ఇందులో హీరోయిన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. పరిణితి చోప్రా, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఇంకా తేలలేదు.
అనిల్ రావిపూడి ఈ కథని భార్యాభర్తల మధ్య ఎమోషన్ ఉన్న కథగానే రాసుకున్నాడని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లా ఇది కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. భార్యాభర్తల కెమిస్ట్రీ ఈ సినిమాలో కీలకమని సమాచారం. చిరంజీవి పాత్రని ఫ్యామిలీ మ్యాన్ లా తీర్చిదిద్దాడట అనిల్. ఉగాదికి ఈ సినిమాని లాంఛనంగా మొదలు పెడతారు. హీరోయిన్ మిగతా నటీనటులు ఫిక్స్ అయిన తర్వాత ఒక లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది.
మరో సంగతి ఏంటంటే చిరంజీవి ఒక సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తారని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఆ సినిమా అనిల్ రావిపూడిదేనా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు . వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని సిద్ధం చేసేలా ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరగనున్నాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాకి నిర్మాతలు.