చిరంజీవి – బాబి కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరు పుట్టిన రోజు సందర్భంగా.. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఆ లుక్ లో చిరు మాసీ గా కనిపిస్తున్నాడు. `పూనకాలకు సిద్ధంగా ఉండండి` అంటూ బాబీ కూడా.. మెగా ఫ్యాన్స్ ని ఊరింపుల్లో పడేశాడు. ఈచిత్రానికి `వీరయ్య` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. బాబి కూడా `వీరయ్య` టైటిల్ తోనే ఈ కథ రాశాడు. చిరు కూడా ఓకే అన్నాడు.
అయితే ఇప్పుడు వీరయ్య టైటిల్ విషయంలో చిరు సందిగ్థంలో పడినట్టు సమాచారం. ఈ టైటిల్ మరీ పాత వాసన కొడుతోందని కొంతమంది సన్నిహితులు చిరుకి సలహా ఇచ్చార్ట. దాంతో.. చిరు ఈ టైటిల్ ని పక్కన పెట్టి, కొత్త టైటిల్ గురించి ఆలోచించమని బాబికి ఆర్డర్ వేశాడట. నిజానికి చిరు పుట్టిన రోజున ఈ టైటిల్ ప్రకటించాల్సిందని, చిరు నిర్ణయంతో.. చిత్రబృందం వెనక్కి తగ్గిందని సమాచారం. సో… ఈ సినిమా కి వీరయ్య టైటిల్ లేనట్టే.