చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆచార్య అవ్వగానే లూసీఫర్ మొదలుపెట్టనున్నారు. బాబి కథ కూడా ఓకే అయిపోయింది. బాబి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది మల్టీస్టారర్ అని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు బాబి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. చిరు సినిమా ఎలా ఉండబోతోంది? ఆ నేపథ్యం ఏమిటి? అనే విషయంలో ఓ కీలకమైన క్లూ ఇచ్చారు. “ఇది ఓ స్టార్ కీ అభిమానికీ మధ్య జరిగే కథ“ అని ఒక్క ముక్కలో చెప్పేశారు. ఆ స్టార్ గా చిరంజీవి నటిస్తుంటే, అభిమానిగా మరో హీరో కనిపించాలి. సో.. ఇప్పుడు చిరు కి తగిన ఫ్యాన్ ని వెతకాలన్నమాట.
“చిన్నప్పటి నుంచీ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఓ అభిమానిగా ఎలా చూడాలనుకుంటున్నానో..ఈ సినిమా అలా ఉంటుంది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలు చూసి ఎలా చప్పట్లు కొట్టానో.. అలా ఉంటుంది ఈ సినిమా. ఓ గంట కథ చెప్పగానే చిరు ఓకే అనేశారు..“ అని బాబి చెబుతున్నాడు. బాలీవుడ్ లో `ఫ్యాన్` అనే సినిమా వచ్చింది. అదీ స్టార్ కీ అభిమానికీ జరిగే కథే. కాకపోతే… స్టార్ పై అభిమాని తీర్చుకునే రివైంజ్ అది. మరి బాబి ఈసారి ఈ కథని ఎలా డిజైన్ చేశాడో..?