చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. ‘విశ్వంభర’ తరవాత ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో సిందిగ్థం నెలకొంది. చిరు చుట్టూ దాదాపు 10 మంది దర్శకులు ఉన్నారు. వాళ్లంతా చిరుకి కథలు చెప్పి ‘ఓకే’ చేయించుకొన్నవాళ్లే. అయితే చిరు వాళ్లలో ఎవరికి అభయహస్తం ఇచ్చారన్న విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం చిరు నెక్ట్స్ సినిమాపై ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. చిరు తదుపరి సినిమా హరీష్ శంకర్‌తో ఫైనల్ అవ్వడం దాదాపు ఖాయం అయిపోయింది. బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోమని హరీష్‌కు చెప్పేశార్ట చిరు. అందుకే హరీష్ చిరు ప్రాజెక్ట్‌పై మరింతగా ఫోకస్ చేశారు.
హరీష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పవన్ తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పక్కన పెట్టి, పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల ‘మిస్టర్ బచ్చన్’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు హరీష్. ఆ సినిమా శరవేగంగా పూర్తవుతోంది. `విశ్వంభర`లో చిరు వర్క్ ఈ జూలై నాటికి అవుతుంది. ఆ తరవాత చిరు ఫ్రీనే. ఆగస్టు నుంచి హరీష్ – చిరంజీవి సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. ఓవైపు పవన్, మరోవైపు చిరంజీవి సినిమాలు రెండింటీని హరీష్ ఒకేసారి పూర్తి చేసే అవకాశం ఉంది. చిరు, పవన్‌లను ఒకే సమయంలో డైరెక్ట్ చేసే అరుదైన ఛాన్స్.. హరీష్ చేజిక్కించుకొన్నట్టే.