ఏలియ‌న్ల‌తో చిరు కామెడీ!

చిరంజీవి నుంచి వ‌స్తున్న కొత్త సినిమా `విశ్వంభ‌ర‌`. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ‘బింబిసార‌’ ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటోంది. అన్న‌పూర్ణ స్టూడియోలో రూపొందించిన ప్ర‌త్యేక‌మైన సెట్ లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ క‌థ‌లో ఏలియ‌న్ సెట‌ప్ కూడా ఉంద‌ట‌. వాటికి సంబంధించిన చిత్రీక‌ర‌ణే ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని టాక్.

ఇదో ఫాంట‌సీ క‌థ‌. ‘విశ్వంభ‌ర‌’ అనే కొత్త లోకాన్ని వెదుక్కొంటూ హీరో చేసే ప్ర‌యాణ‌మే ఇతివృత్తం. అందుకోసం హీరో అన్ని లోకాల్నీ ట‌చ్ చేసుకొంటూ వెళ్తాడ‌ని, అందులో భాగంగానే ఏలియ‌న్ల‌నీ చూపించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఏలియ‌న్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ని, అక్క‌డ చిరు చేసే కామెడీ ఈ చిత్రానికి మ‌రో హైలెట్ అని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏలియ‌న్ సెట‌ప్ ని తెలుగు సినిమాల్లో ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌లేదు. ఈ ఎలిమెంట్ ని ‘విశ్వంభ‌ర‌’ బాగా వాడుకొనే అవ‌కాశం ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఆగ‌స్టు నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలకు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

గెస్ట్ రోల్స్ ఉన్నాయి.. డార్లింగ్‌!

రెండు వారాలుగా 'క‌ల్కి' జాత‌ర కొన‌సాగుతోంది. ఈవారం 'భార‌తీయుడు 2' రాబోతోంది. వ‌చ్చే వారంలో డార్లింగ్ వ‌స్తోంది. 'డార్లింగ్‌' చిన్న సినిమానే అయినా, చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి హీరోగా చేసిన సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close