చిరంజీవి గత కొన్నాళ్ళుగా దర్శకుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అవి కొరటాల శివకి ఆపాదించబడుతున్నాయి. తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య మీట్ లో ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు చిరు. ‘‘నేను అనే మాటలకు దర్శకులు హర్ట్ అవుతారేమో అంటూనే చాలా కామెంట్స్ వినిపించారు. ‘సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కాదు.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్లో పూర్తి చేసి ఇవ్వాలి. అదే దర్శకుడు మొదటి సక్సెస్” అన్నారు చిరు.
అంతేకాదు ”కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. దయచేసిన నిర్మాత డబ్బులని బుట్టదాఖలు చేయకండి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు.” సెలవిచ్చారు
అయితే సహజంగానే ఈ వ్యాఖ్యలు మళ్ళీ కొరటాల చుట్టూనే తిరిగాయి మీడియాలో.ఆచార్య ఎఫెక్ట్ నుండి చిరంజీవి ఇంకా బయటపడలేదా ? అంటూ కామెంట్లు వినిపించాయి. దర్శకుల గురించి ఎప్పుడూ పెద్దగా నెగిటివ్ సైడ్ మాట్లాడని చిరు, ఆచార్య ఫ్లాఫ్ తర్వాత కాసేపు మీడియాకి ఎదురుపడితే చాలు.. దర్శకుల పాయింట్ లాగుతున్నారు. ఆయన మాటలలో ఉద్దేశం ఏమిటో గానీ.. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఆచార్య, పాదఘట్టం అంటూ మీమ్స్, ట్రోల్స్ బయటికి వస్తున్నాయి. చిరు కొన్నాళ్ళు ఈ టాపిక్ వదిలేస్తేనే మంచిదేమో.. లేదంటే .. ఆచార్య డిజాస్టర్ మర్చిపోయిన మెగాఫ్యాన్స్ కి కూడా మళ్ళీమళ్ళీ గుర్తు చేసినట్లుగా అవుతోంది.