నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 98 వ జన్మదినం ఇవాళ. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే..
చిరంజీవి ట్వీట్ చేస్తూ, “ప్రముఖ గాయకుడు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా కి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం. వారి 100 వ జన్మదినం దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే, అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ..” అని రాసుకొచ్చారు.
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021
ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా వర్ధంతి సందర్భంగా పలుమార్లు ఎన్టీఆర్ కి భారతరత్న డిమాండ్ తెరమీదకు మీదకు వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న పాలకులనుండి సరైన ప్రయత్నం మాత్రం జరగడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అయినా ఇతర ప్రభుత్వం అయినా ఎన్టీఆర్ కి భారత రత్న కోసం గట్టిగా ప్రయత్నించిన నిదర్శనాలు లేవని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు.