పాత్రికేయుడు, నటుడు టీఎన్నార్ కరోనా బారీన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీఎఎన్నార్ కుటుంంబానికి తక్షణ సహాయంగా రూ.1 లక్ష అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని సురేష్ కొండేటి.. టీఎన్నార్ భార్యకు అందజేశారు. ఆమెతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు కూడా. టీఎఎన్నార్ ఇంటర్వ్యూలు కొన్ని చూశానని, అవన్నీ చాలా సహజంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరు ఫోన్లో పలకరించడం, ఆర్థిక సహాయాన్ని అందివ్వడం పట్ల.. టీఎన్నార్ సతీమణి సంతోషం వ్యక్తం చేశారు. “చిరంజీవి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. 200వ ఇంటర్వ్యూ ఆయనతోనే చేయాలనుకున్నారు. అయితే చిరంజీవిని ఒక్కసారి కూడా కలుసుకునే అవకాశం దక్కలేద“న్నారు టీఎన్నార్ సతీమణి.