ఈతరం హీరోలు ఒకేపాత్రలో రకరకాల గెటప్పుల్నిచూపిస్తున్నారు. ఇది వరకైతే.. దాదాపుగా అన్నీ డ్యూయల్ రోల్సే. కొంతకాలం అదో ట్రెండ్ లా నడిచింది. అగ్ర కథానాయకుల్లో డ్యూయల్ రోల్స్ ఎక్కువ చేసింది చిరునే. ఆ సినిమాలన్నీ హిట్స్. ఇప్పుడు చిరు మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. చిరు తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు టాక్. ఇటీవల.. బాబి -చిరు మధ్య భేటీ జరిగింది. చిరుకి ఫుల్ స్క్రిప్టు ని వినిపించాడు బాబి. కొన్ని మార్పులు, చేర్పులతో చిరు ఈ కథని ఓకే చేసేశాడు. ప్రస్తుతం `ఆచార్య` షూటింగ్ జరుగుతోంది. ఆ తరవాత `లూసీఫర్` రీమేక్ పట్టాలెక్కుతుంది. అది పూర్తయిన తరవాతే… బాబి సినిమా ఉండబోతోంది. మరోవైపు మెహర్ రమేష్ తో ఓ సినిమా చేయాలి చిరు. బాబి సినిమానీ, మెహర్ రమేష్సినిమానీ ఒకేసారి పట్టాలెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్.