చిరంజీవి `సోషల్ మీడియా` ఎంట్రీ జరిగిపోయింది. ఉగాది సందర్భంగా ఈ ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు చిరు తొలి ట్వీట్ చేశారు. చిరంజీవి కొణిదెల పేరుతో ఓపెన్ చేసిన ఈ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి చిరు తొలి ట్వీట్ వచ్చేసింది.
అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నాతోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్నికుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అంటూ తెలుగులో ట్వీట్ చేశారు చిరు. ఇదే సందేశాన్ని ఇంగ్లీషులోనూ పంపారు