లాక్ డౌన్ సమయంలోనూ మరింత యాక్టీవ్ గా కనిపిస్తున్నారు చిరంజీవి. ప్రజల్ని చైతన్య పరుస్తూ చిరు కొన్ని వీడియోలు చేశారు. పోలీసుల పిలుపు మేరకు ప్లాస్మా డొనేషన్ క్యాంపులో పాల్గొని.. వాళ్లని ఉత్సాహ పరిచారు. ఇంటి పట్టున ఉంటూ.. ఫన్నీ వీడియోలు విడుదల చేసి, ఫ్యాన్స్ ని ఉత్సాహ పరిచారు.
నిన్న ఆదివారం కదా. వంటింట్లోనూ దూరి ప్రయోగాలు చేశారు. చిరుకి ఇష్టమైన వంటకం.. చింతకాయ, చిట్టి చేపల ఫ్రై. చిన్నప్పుడు అమ్మ చేసి పెడితే, ఇష్టంగా తినేవారట. అదే వంటకం… తాను అమ్మకు చేసి పెడితే ఎలా ఉంటుందో అని భావించారు. అందుకే ఆదివారం పూట.. ఈ ప్రయోగం చేసి, స్వయంగా వండిపెట్టి, అమ్మకు తినిపించి.. `సూపర్` అనిపించుకున్నారు.
అమ్మకి వడ్డిస్తున్నప్పుడు, అమ్మ రియాక్షన్ చెబుతున్న క్షణాల్లో…`సినిమా ఫలితం ఎలా ఉంటుందో` అని టెన్షన్ పడే హీరోలా… ఉత్కంఠతతో ఎదురు చూశారు. మొత్తానికి అమ్మచేత.. `చాలా బాగుంది` అనిపించుకున్నారు. మొత్తానికి… చిరుద్వారా.. ఓ కొత్త వంటకం.. అభిమానులకు పరిచయం అయ్యింది. ఇక తరచూ… తెలుగు లోగిళ్లలో ఈ వంటకం.. తయారవుతూనే ఉంటుంది.
https://www.instagram.com/tv/CDshKfODBsx/?utm_source=ig_web_copy_link