ట్రెండ్ మారింది. కంటెంట్ కాలమిది. ఇప్పుడు కంటెంట్ కావాలి. అదీ ఫాస్ట్ గా ఇవ్వాలి. దానికి తగ్గట్టుగానే హీరోల ప్లాన్ వుండాలి. ఏడాదికి ఓ సినిమా చేసి మరో ఆరు నెలలు అలోచించి కొత్త సినిమా సెట్స్ పై తీసుకెళ్ళే రోజులు కావివి. చకచక ప్లాన్ చేసుకుంటూ వెళ్లిపోవాలి. అవసరమైతే డైరెక్ట్ ఓటీటీకి కూడా కంటెంట్ ఇచ్చేయాలి. అన్నీ ఫాస్ట్ గా జరగాలి. ఇప్పుడు ట్రెండ్ ఇదే. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇదే ట్రెండ్ లో సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా అంటే చాలా కూడికలు, తీసివేతలు, భాగహారాలు. కానీ ఇప్పుడు సినిమా విస్తృతి పెరిగింది. మంచి కంటెంట్ ఇస్తే .. డబుల్ రేటు చెల్లించి తీసుకునే ఓటీటీ సంస్థలు వున్నాయి. ఇప్పుడు చేయాల్సిందంతా కంటెంట్ ప్రోడ్యుస్ చేయడమే. ఇప్పుడా కంటెంట్ ని సూపర్ ఫాస్ట్ గా ఇచ్చే ప్లాన్ లో వున్నారు మెగాస్టార్. ఆచార్య సినిమా పూర్తయింది. గాడ్ ఫాదర్, భోలా శంకర్ సెట్స్ పై వున్నాయి. బాబీ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. అలాగే వెంకీ కుడుములతో సినిమా లైన్ లో వుంది. ఇప్పుడు సుకుమార్ తో సినిమా కూడా ఖారరైయింది. త్వరలోనే వివరాలని స్వయంగా సుకుమారే చెప్పారు. ఇక్కడితో అయిపోలేదు. మెగాస్టార్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. ఇది ఎప్పటినుంచో ఇటు చిరు, అటు త్రివిక్రమ్ మనసులో వుంది. కథ కుదిరితే ఏ క్షణమైన ప్రకటన రావచ్చు. ఇప్పుడు అరడజను సినిమాలని లైన్ లో పెట్టారు చిరు. ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ జరిపేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వేగం కావాలి. అదే వేగంతో ముందుకు వెళుతున్నారు మెగాస్టార్. ఇది మెగాఫ్యాన్స్ కూడా ఆనందించే విషయం.