చిరంజీవి – రాధికలది సూపర్ హిట్ కాంబో! చిరుతో పోటా పోటీగా నటించి, డాన్స్ చేయగల హీరోయిన్లలో రాధిక నెంబర్ వన్ పొజీషన్ లో ఉంటుంది. సినిమాల్ని పక్కన పెడితే, చిరు – రాధికలు మంచి స్నేహితులు. రాధిక ప్రతీ ఇంటర్వ్యూలోనూ చిరుని గుర్తు చేసుకొంటూనే ఉంటుంది.చిరు కూడా అంతే. `రాధిక నా బెస్ట్ ఫ్రెండ్` అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఈ స్నేహంతోనే రాధికతో ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు చిరు.
రాధిక సొంత సంస్థ రాడాన్ లో చిరు ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రాధిక కొంతమంది రచయితలతో మంతనాలు జరుపుతోంది. చిరుకి తగిన కథ ఎవరి దగ్గర ఉందో.. అన్వేషిస్తోంది. రెండో ఆప్షన్‌గా చిరు కూడా ఓ లైన్ రెడీ చేసి పెట్టార్ట. ఆ లైన్ పై వర్క్ చేసే బాధ్యత ఒకరిద్దరు రచయితలకు అప్పగించారు. ఆ పనులు ఒక వైపు సాగుతూనే, మరోవైపు దర్శకుడ్ని ఫైనలైజ్ చేసే పనుల్లో ఉన్నారు రాధిక. కొత్త యేడాది ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.