‘గేమ్ ఛేంజర్’కి పాజిటీవ్ వైబ్రేషన్స్ మెల్లమెల్లగా మొదలైపోయాయి. డల్లాస్ లో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విజయవాడలో ఓ భారీ కటౌట్ ఆవిష్కరించి, దాదాపుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేంజ్లో హంగామా చేశారు. పాటలు మెల్లమెల్లగా ఎక్కుతున్నాయి. వేదికపై చరణ్ కాన్ఫిడెన్స్ చూస్తే ఈసారి శంకర్ గురి తప్పడన్న భరోసా కలుగుతోంది. ఇప్పుడు చిరంజీవి నుంచి కూడా రివ్యూ వచ్చేసింది. ఆదివారమే… ఈ సినిమా చిరు చూసేశారు. చిరుకి ఈ సినిమా బాగా నచ్చిందని, ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం అని తనతో అన్నారని దిల్ రాజు వేదికపై నుంచి తన సంతోషాన్ని ప్రకటించేశాడు. ఇన్ సైడ్ వర్గాలు కూడా చిరుకి సినిమా బాగా నచ్చిందని, ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మ్సెన్స్కు ఫిదా అయిపోయారని, సినిమా తప్పు చేయదన్న నమ్మకం కలిగిందని చెబుతున్నాయి.
చిరుకి కూడా శంకర్ పై కాస్త అనుమానం ఉంది. ఈ సినిమా గురించి వేదికలపై చిరు ఎప్పుడూ మాట్లాడలేదు. బహుశా ఆ అవకాశం కూడా రాలేదు. సినిమా మొత్తం చూశాకే.. ఏమైనా మాట్లాడదామని చిరు ఫిక్సయ్యి ఉంటారు. ఇప్పుడు సినిమా చూసేశారు కాబట్టి.. తన రివ్యూ ఇచ్చేశారు. చిరు జడ్జిమెంట్ బాగుంటుంది. సాధారణంగా సినిమా చూశాక కొన్ని మార్పులు చెబుతుంటారు. ఈసారి అది కూడా జరగలేదని తెలుస్తోంది. ఇందుకు రెండు కారణాలు ఉండొచ్చు. సినిమా వంక పెట్టలేనంత బాగుండొచ్చు. ఇప్పుడు మార్పులు చెప్పినా శంకర్ వినిపించుకోడన్న అనుమానం కావొచ్చు. మొత్తానికి చిరు అయితే ఈ సినిమాతో హ్యాపీ! భారతీయుడు 2 లాంటి డిజాస్టర్ తరవాత శంకర్ యావరేజ్ సినిమా ఇచ్చినా – అదే పది వేలు. ఇక నిజంగానే సంక్రాంతికి అదిరిపోయే సినిమా ఇస్తే ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా హ్యీపీనే.