లాక్ డౌన్ సమయాన్ని సెలబ్రెటీలు వివిధ రకాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త కొత్త విషయాల్ని, కళల్నీ నేర్చుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి సైతం ఇంటి పనుల్లో బిజీ అయిపోయాడు. పనిలో పనిగా స్పానిష్ నేర్చుకుంటున్నాడట. ఈ విషయాన్ని చిరునే స్వయంగా చెప్పుకొచ్చాడు.
తన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు సైతం కొత్త భాషలు నేర్చుకుంటున్నారని, ఆస్ఫూర్తితోనే స్పానిష్‌పై దృష్టి పెట్టానని చిరు పేర్కున్నాడు. ఇంటర్నెట్లో ఎంతో సంపద ఉందని, దాంతో ఇంటి పట్టునే కూర్చుని నేర్చుకునే అవకాశం దక్కుతోందని, ఈరోజుల్లో టైమ్ లేదని చెప్పడం ఓసాకు మాత్రమే అని, దేశ ప్రధానికైనా, కూలి వాడికైనా చేతిలో 24 గంటలు ఉంటాయని, వాటిని సద్వినియోగ పరచుకోవాలన్నారు చిరు. తనకు సైన్స్‌కి సంబంధించిన అంశాలు, వైద్య రంగానికి చెందిన విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని, నాగబాబు కూడా తనకు కొత్త కొత్త విషయాలు చెబుతుంటాడని, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన అందరికీ ఉండాలన్నాడు చిరు.