మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడం సంచలనమే కానీ.. ఆయన రెండు రోజుల కిందట కేసీఆర్‌ను కలవడం.. ఆ సమావేశంలో కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం.. డబుల్ సంచలనం అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. తనను కలిసిన వాళ్లందరూ టెస్టులు చేయించుకోవాలని చిరంజీవి సోషల్ మీడియా పోస్టులో సూచించారు. సాధారణంగా కాంటాక్టులందరూ ఐసోలేషన్‌కి వెళ్లి టెస్టులు చేయించుకుంటారు. ఇప్పుడు.. చిరంజీవి కాంటాక్టుల లిస్టులో కేసీఆర్ ముఖ్య స్థానంలో ఉంటారు. కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో చిరంజీవి కానీ.. కేసీఆర్ కానీ.. నాగార్జున కానీ మాస్క్‌లు పెట్టుకోలేదు.
పైగా వారు.. షెక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం.. తమ చేతుల ద్వారా చెక్కులు అందించడం లాంటివి చేశారు. అంటే.. అక్కడ వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ప్రగతి భవన్‌లోనూ కరోనా టెన్షన్ ప్రారంభమయింది. ఏడో తేదీన సమావేశం సమావేశం జరిగింది. ఎనిమిదో తేదీన చిరంజీవి టెస్ట్ చేయించుకున్నారు. అంటే.. ఆయనకు ఏడో తేదీన కరోనా ఉందని అనుకోవాలి. లక్షణాలు లేని కరోనా పాజటివ్ కాబట్టి.. మెగాస్టార్ .. ఎలాంటి కోవిడ్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా… కేసీఆర్‌తో సమావేశానికి వెళ్లగలిగారు. కరోనా టెస్టు విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
సీఎంగా ఆయన ఆరోగ్యంపై.. అధికారులు అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనకు పలుమార్లు కరోనా టెస్టులు చేసే ఉంటారు. మరోసారి చేసే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా టెస్టు చేయించుకోక తప్పదు. అలా చేయించుకోకుండా… సాధారణ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. తనతో పాటు ఇతరుల్ని కూడా రిస్క్‌లో పెట్టినట్లవుతుంది.