కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ఆయన మార్వాద పూర్వకంగా ‘విశ్వంభర’ సెట్స్ లో కలిశారు. చిరు ఆయనకు ఆనందంగా స్వాగతం పలికారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పారు చిరు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారని, ఆయన చూపిన సానుకూలతకు ధన్యవాదాలు తెలిజేశారు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు చిరు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు కందుల దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.