చిరంజీవి కుమార్తె సుస్మిత… గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్లో ఇప్పటి వరకూ ఓటీటీ కంటెంట్ మాత్రమే వచ్చింది. సంతోష్ శోభన్తో ఓ చిన్న సినిమా చేశారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. గోల్డ్ బాక్స్ బ్యానర్లో చిరంజీవి ఓ వెబ్ సిరీస్ చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అదీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు తన కూతురి కోసం ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు చిరంజీవి.
చిరంజీవి కోసం కల్యాణ్ కృష్ణ ఓ కథ సిద్ధం చేశాడని, ఇందులో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడని వార్తలు జోరందుకొన్నాయి. ఈ సినిమా గోల్డ్ బాక్స్ బ్యానర్ లోనే నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిరు రీ ఎంట్రీ తరవాత… కొణిదెల ప్రొడక్షన్స్ లో మూడు సినిమాలు చేశాడు. వాటికి రామ్ చరణ్ నిర్మాత.
ఆచార్య తరవాత.. రామ్ చరణ్ ప్రొడక్షన్ గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఈసారి కూతురి బ్యానర్లో సినిమా చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడు. బింబిసార దర్శకుడు వశిష్టతోనూ చిరు ఓ సినిమా ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. దీంతో పాటే సమాంతరంగా కల్యాణ్ కృష్ణ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.