మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్. ఐతే ఈ మూడు సినిమాల రేమ్యునిరేషన్ మాత్రం చెప్పడం లేదట చిరు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రేమ్యునిరేషన్ ఎంతో చెప్పని మూడు సార్లు అడిగారు. ‘ముందు చేద్దాం.. తర్వాత చూద్దాం’ అనే సమాధానం ఇస్తున్నారట చిరు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత దాని స్థాయి, వచ్చిన లాభాలు బట్టి వాటా తీసుకోవాలనే ఆలోచన వున్నట్లు మెగాస్టార్.
మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకే కాదు.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ కి కూడా ఇదే పంధాలో వున్నారు చిరు. ఇప్పటి వరకూ ఈ సినిమాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నిజానికి చిరు అనుసరిస్తున్న ఈ ఫార్ముల నిర్మాతలకు మేలు చేసేదే. చిరు కి ఇచ్చే రేమ్యునిరేష్ ముందు సినిమా నిర్మాణం పై పెట్టి రిజల్ట్ ప్రకారం రేమ్యునిరేషన్ లెక్కలు చేసుకోవడం నిర్మాతలకు కలిసొచ్చే నిర్ణయమే.