చిరంజీవి ఇప్పుడు యువ దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వరుసగా యంగ్ డైరెక్టర్స్ కథలకు ఓకే చెబుతున్నారుక. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్నారు. అనిల్ రావిపూడి, మారుతి, హరీష్ శంకర్లు చిరు కోసం కథలు రెడీ చేస్తున్నారు. ఈజాబితాలో మరో దర్శకుడి పేరు చేరింది. తనే వి.ఐ.ఆనంద్. టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర మెప్పించారు ఆనంద్. సందీప్ కిషన్‌తో రూపొందించిన ‘ఊరి పేరు భైరవకోన’ ఈవారం విడుదలకు రెడీ అవుతోంది. ఈలోగా చిరుకి కథ చెప్పే ఆఫర్ వచ్చింది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. అందుకోసం అనిల్ సుంకర కొత్త కథల్ని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఆనంద్ చెప్పిన కథ ఆయనకు నచ్చింది. చిరంజీవికైతే ఆ సినిమా బాగుంటుందని అనిల్ సుంకర ఫిక్సయ్యారు. చిరుతో త్వరలోనే ఓ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో కథ ఓకే అంటే.. ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు పడుతుంది. మరోవైపు కొరటాల శివ బ్యానర్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నారు ఆనంద్. దానికి సంబంధించి.. కథ రెడీగానే ఉంది. హీరో కోసం వేట మొదలైంది. నిఖిల్ తో కూడా ఆనంద్ ఓ సినిమా చేస్తారు. అయితే.. వీటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి. చిరుతో గనుక ఛాన్స్ వస్తే.. ఆనంద్ జాక్ పాట్ కొట్టినట్టే.