చిరంజీవికి ఎన్నో సూపర్‌డూపర్ హిట్లు అందించిన రచయితలు పరుచూరి బ్రదర్స్. వాళ్ల అనుభవంపై చిరుకి అపారమైన నమ్మకం. అందుకే తన సినిమాకి కథ ఎవరు అందించినా, దాని బోబోగులు చూసేది మాత్రం పరుచూరి బ్రదర్సే. ఖైదీ నెం.150 విషయంలోనూ పరుచూరి వాళ్ల సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. అయితే.. సడన్గాచిరు మైండ్ సెట్ ఏమైనా మారిందేమో అనిపిస్తోంది. పరుచూరి సోదరులపై నమ్మకం కాస్త కాస్త తగ్గుతోందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. దానికి కారణం.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డినే.
పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో ఈ స్క్రిప్టుని రెడీ చేసి పెట్టుకొన్నారు. సీన్ బై సీన్ వాళ్లు రాసేశారు. అయితే.. ఇప్పుడు ఈ కథ కోసం మరికొంతమంది రచయితలు కసరత్తులు చేస్తున్నారు. సంభాషణల కోసం బుర్రా సాయిమాధవ్ టీమ్ లో చేరాడు. ఇప్పుడు… భూపతి రాజా హ్యాండ్ కూడా తోడైందని సమాచారం. స్క్రీన్ ప్లే, ఎమోషనల్ సీన్లు పరంగా భూపతిరాజా సహాయం అందించనున్నాడని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోందని సమాచారం. రెండు మూడు వెర్షన్ల రెడీ చేస్తున్నారని, అందులో చిరు ఓటేసిన వెర్షన్‌ని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది.