`ఆక్సిజన్ లేకుండా ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదు` అనే ఆశయంతో… చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే ఈ మిషన్ ప్రారంభం కానుంది. ఉదయం 10.30 ని.లకు గుంటూరు, అనంతపూర్ జిల్లాలలో ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం అవుతున్నాయి. రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్‌తో పాటు మరో ఐదు జిల్లాలలోనూ ఈ ఆక్సిజన్ బ్యాంకులకు అంకురార్పణ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాలలోనూ ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పాలన్నది చిరు లక్ష్యం. ఈ వారాంతంలోగా.. అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బ్యాంకుల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి ఒకొక్క జిల్లాలోనూ 100 ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులోకి ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు ఆక్సిజన్ సిలెండర్లు సరఫరా చేస్తూనే ఉండాలని చిరంజీవి నిర్ణయించారు. అయితే… ఆక్సిజన్ సిలెండర్లు ఉచితంగా ఇస్తారా? కనీస ధర అంటూ ఉంటుందా? ఎవరికి, ఏ ప్రాతిపదికన అందిస్తారు? అనేది తెలియాల్సివుంది.
Mission begins. Let there be no deaths due to lack of life saving oxygen. #Covid19IndiaHelp #ChiranjeeviOxygenBanks @AlwaysRamCharan https://t.co/eRFpTIXOKe
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 26, 2021