లైగర్ తో పూరి జగన్నాథ్ కి పరాజాయం వచ్చినప్పటికీ తన క్యాలిబర్ పై ఎవరికీ అనుమానాలు లేవు. పూరి నుండి ఏ క్షణంలోనైనా ఇండస్ట్రీ హిట్ రావచ్చు. ఇటివలే చిరంజీవి లైవ్ లో అటోజానీ కథ గురించి అడిగారు. దానికంటే మంచి కథ మీకు చెప్తానని అన్నాడు పూరి.అయితే ఇదేదో సభాముఖంగా ఫార్మాలిటీకి చెప్పిన మాట కాదు. చిరు-పూరి సినిమా కోసం తెరవెనుక పనులు జరుగుతున్నాయి.
ఆటోజానీని పక్కన పెట్టి కొత్త కథ రాస్తున్నాడు పూరి. ఈ కథ చెప్పడానికి మూడు నెలల సమయం అడిగాడు. మరోవైపు జనగణమన పనులు కూడా జరుగుతున్నాయి. దిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలనేది పూరి ఆలోచన. అయితే వీలైనంత త్వరగా జనగణమనని పూర్తి చేసి చిరు ప్రాజెక్ట్ లోకి రావాలనేది పూరి ప్లాన్. అన్నీ అనుకున్నట్లు జరిగితే పూరి- చిరుల ప్రాజెక్ట్ 2023 ప్రధమార్ధంలోనే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.