చిరంజీవిపై ఓ విమర్శ బలంగా వినిపిస్తుంటుంది. ఆయన ఎక్కువగా రీమేకులపై ఆధారపడతాడని. రీ ఎంట్రీ గా వచ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుదలయ్యే గాడ్ ఫాదర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో ఉన్న వేదాళం కూడా రీమేక్ కథే. చిరంజీవి లాంటి కథానాయకుడు… తలచుకొంటే కొత్త కథలకు కొరతొస్తుందా? రీమేకుల్ని ఎంచుకొని ఎందుకు సేఫ్ గేమ్ ఆడతాడు? అనేది చిరుపై విమర్శకులు సంధించే ప్రధాన అస్త్రం. దీనికి చిరు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
”రీమేక్ అనగానే దాన్ని తక్కువ భావంతో చూస్తుంటారు. అది నాకు నచ్చదు. రీమేక్ పెద్ద ఛాలెంజ్. ఓ భాషలో, ఓ స్థాయిలో ఆడేసిన సినిమాని, దానికి ధీటుగా తీయడం మామూలు విషయం కాదు. అంచనాలు పెరిగిపోతాయి. వాటిని అందుకోవడానికి చాలా కష్టపడాల్సివస్తుంది. నా రీమేక్ సినిమాలే తీసుకోండి. మాతృక కంటే మిన్నగా ఉన్న సినిమాల సంఖ్యే ఎక్కువ. రీమేకులు నటిస్తున్నప్పుడు సదరు హీరో బాడీ లాంగ్వేజ్, మేనరిజం అనుకరించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. సెట్లో సీన్ రిఫరెన్స్ కూడా చూడను. నా దైన పంథాలోనే చేసుకొంటూ వెళ్తాను.అందుకే నా రిమేకులు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. హిస్టరీ చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది” అని క్లారిటీ ఇచ్చాడు చిరు.