సీఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను చిరంజీవి తోసి పుచ్చారు. తాను రాజకీయాలకు దూరమని స్పష్టంగా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలో డోకిపర్రు గ్రామంలో నిర్మించిన ఓ ఆలయంలో గోదాదేవి కల్యాణంలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్తూనే మీడియాకు సమాధానం ఇచ్చారు. తనకు రాజ్యసభ సభ్యత్వ ప్రతిపాదన జగన్ పెట్టారనేది అవాస్తవమని స్పష్టం చేశారు.
రాజకీయాలకు దూరం అని చిరంజీవి స్పష్టంగా ప్రకటించడంతో ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలన్ని అవాస్తవమని అంచనా వేయవచ్చు. రాజకీయంగా మైండ్ గేమ్ ఆడేందుకు.. చిరు రాజ్యసభ సీటు కోసం బెండ్ అవుతారేమోనని వైసీపీ వర్గాలు గాల్లో రాయివేసిటన్లుగా భావిస్తున్నారు. దానికి చిరంజీవి స్వయంగా చెక్ పెట్టేశారు.
నిజానికి గత ఎన్నికలకు ముందే చిరంజీవి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారనిపవన్ కల్యాణ్ ప్రకటించారు. చిరంజీవి ఫ్యాన్స్ అంతా ప్రత్యేక కార్క్రమంలో జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే తరచూ చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు రాజ్యసభతో పాటు కేంద్రమంత్రి పదవిని కూడా బీజేపీ ఆఫర్ చేసిందని గతంలో ప్రచారం జరిగింది. చివరికి అదేమీ లేదని తేలిపోయింది.