సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని తెలియగానే .. సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి రంగంలోకి దిగిపోయారు. వెంటనే.. ఫిలించాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ను అప్రమత్తం చేశారు. ఇదే విషయాన్ని పరోక్షంగా ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
ఉదయం ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ఇస్తానంటూ తాను పెట్టిన ప్రతిపాదనపై సినీ పరిశ్రమ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు ఇస్తానని స్వయంగా చెబితే.. పట్టించుకోకపోవడం ఏమిటని ఆయనలో అసహనం కనిపించింది. గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్నవారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని.. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది.. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను… ఈ కార్యాచరణను ముందుకు
తీసుకువెళ్తాలన్నారు.
Also Read : జగ్గారెడ్డికి చిరంజీవిని విమర్శించాల్సిన అవసరం ఏంటి?
ఈ అంశంపై వెంటనే చిరంజీవి స్పందించారు. ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాలని ఫిలిం చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ను కోరారు. ముందుగానే ఆయన బృందంతో చిరు మాట్లాడి ఈ ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. చిరంజీవి చొరవ తీసుకోవడంతో త్వరలో సినీ పరిశ్రమ నుంచి ఓ బృందం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.