మెగాస్టార్ చిరంజీవి ఫుల్ లెంథ్ మూవీలో కనిపించడానికి రెడీగా ఉన్నా దానికి తగ్గ కథ మాత్రం ఓకే కాకపోవడం ఫ్యాన్స్ కి కాస్త నిరాశ పరుస్తుంది. ఎప్పుడో దసరా అప్పుడే చిరు సినిమాను ఎనౌన్స్ చేయాల్సి ఉన్నా అది కూడా కుదరలేదు. విజయ్ నటించిన కోలీవుడ్ కత్తి సినిమా రీమేక్ చేద్దామనుకున్నా అది కూడా అటకెక్కింది. వర్మ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వరకు చిరు కత్తి పడదామనుకుంటే వద్దు అనేశారు. అందుకే మనసు మార్చుకుని చిరు కత్తి రీమేక్ ప్రయత్నాలను మానేశాడు.
ఇక ప్రస్తుతం చిరు కన్ను మరో కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాపై పడ్డదని చిరు దాన్నే ఫైనల్ చేసేందుకు చూస్తున్నారని అంటున్నాడు. కోలీవుడ్లో ఈ దీపావళికి అజిత్ వేదలంగా వచ్చి సూపర్ సక్సెస్ సాధించాడు. సినిమా తొలిరోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకుని కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట చిరు.
శౌర్యం, శంఖం, దరువు సినిమాలను డైరెక్ట్ చేసిన శివ తమిళ వేదలం సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే అతనితోనే ఆ సినిమాను ఇక్కడ రీమేక్ చేయిద్దామనుకుంటున్నాడట మెగాస్టార్. అయితే తమిళ వేదలం సినిమాను తెలుగులో కూడా ఆవేశంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు దర్శక నిర్మాతలు. ఒకవేళ చిరు ఆ సినిమా చేసేది నిజమే అయితే సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ ని ఆపేసే చాన్స్ ఉంది. మొత్తానికి మన దర్శకుల కథలు నచ్చని చిరు కోలీవుడ్ వారిపై మాత్రం గురి పెట్టి ఉన్నాడు. ఫైనల్ గా చిరు 150వ సినిమా ఏది అవుద్దో చూడాలి మరి..