తెలుగు చిత్రసీమ దాదాపుగా మర్చిపోయిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. తీన్ మార్ (2011) తరవాత అస్సలు ఆయన పేరే వినిపించడం లేదు. అంతకు ముందు కూడా ఆయన్నుంచి పెద్దగా సినిమాలొచ్చింది లేదు. ఒకప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేసిన జయంత్.. ఆ తరవాత వరుస ఫ్లాపులతో కనుమరుగయ్యారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘కాళహస్తి’తో మళ్లీ తెరపైకొచ్చారు. ఈ సినిమా కోసం చాలామంది టాప్ దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి అసలు రేసులోనే లేని జయంత్‌కి అవకాశం వరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఈ ఆఫర్‌కి కారణం చిరంజీవిని అని తెలుస్తోంది.
అటు గంటాతోనూ, ఇటు జయంత్తోనూ మంచి అనుబంధం ఉంది చిరుకి. చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు.. అండదండగా ఉన్నది గంటానే. ఇప్పుడు టీడీపీలో ఉన్నా.. గంటా చిరంజీవికి బాగా క్లోజన్నది అందరికీ తెలిసిన విషయమే. జయంత్‌తో కలసి బావగారూ బాగున్నారా లాంటి హిట్టు కొట్టాడు చిరు. గంట కుమారుడి కోసం దర్శకుల్ని అన్వేషిస్తున్నప్పుడు ‘జయంత్‌ని తీసుకొంటే బాగుంటుంది’ అనే సలహా ఇచ్చారట చిరు. దాంతో జయంత్‌కి ఈ ఆఫర్ దొరికింది. చిరు రికమెండేషన్ కి ఉన్న పవర్ అది.