చిత్రసీమలో అటుది ఇటు… ఇటుది అటు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఖైది నెం.150 కోసం చిరు పక్కన కథానాయిక కోసం భారీ ఎత్తున అన్వేషణ సాగింది. చాలామంది పేర్లు పరిశీలించారు. నయనతార – అనుష్కలపై చిరు మొగ్గు చూపించాడు. నయన అప్పటికే తెలుగు సినిమాల్ని వీర లెవిల్లో లైట్తీసుకొంది. ఇక ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఆప్షన్.. అనుష్క. స్వీటీని ఎన్నిసార్లు సంప్రదించినా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చేస్తాననో, చేయననో చెప్పలేదు. దాంతో చిరు ఎలాంటి ఆప్షన్లు లేని పరిస్థితిలో కాజల్‌ని కథానాయికగా ఎంచుకోవాల్సివచ్చింది. ఇప్పుడు చిరంజీవి కథానాయికల వేట మళ్లీ మొదలైంది. 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం వీరలెవిల్లో ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యాబాలన్, ఐశ్వర్యరాయ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీళ్లు దక్షిణాదిలో సినిమా చేయడానికి ముందుకొస్తారా?? అనే అనుమానాల దృష్ట్యా ఎందుకైనా మంచిదని అనుష్క కాల్షీట్ల కోసం చిత్రబృందం ప్రయత్నించాలనుకొందట.
‘బాహుబలి’తో అనుష్క క్రేజ్ కాస్త పెరిగింది. పైగా ఉయ్యాల వాడని హిందీలోని డబ్ చేయాలనుకొంటున్నారు. బాహుబలి తో అనుష్క ఫేమ్ దక్కించుకొన్న దృష్ట్యా.. ఉయ్యాలవాడలో అనుష్కని ఎంచుకొంటే.. కచ్చితంగా ప్లస్ అవుతుంది. అయితే.. చిరంజీవి మాత్రం అనుష్కకు ‘నో’ చెప్పాడని టాక్. బాలీవుడ్ కథానాయికనే తీసుకొందాం… అందుకోసం వెయిట్ చేయాలంటే చేద్దాం.. అంటూ చిత్రబృందానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశాడట చిరు. అడిగినప్పుడు `నో` చెప్పినందుకు అనుష్కపై చిరు కోపంగా ఉన్నాడా?? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కాబట్టి.. కథానాయిక పాత్రలో స్వీటీ బాగానే సెట్టవుతుంది. కానీ… చిరు మరీ పట్టింపులకు పోతున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ విద్యాబాలన్, ఐష్ కాదంటే… మళ్లీ స్వీటీ దగ్గరకు రావల్సిందే కదా!!