విధానాల పరంగా చిరంజీవి – కేసీఆర్ కుటుంబం వేరు కావొచ్చు. కానీ.. అభిమాన పరంగా కాదు. చిరంజీవి అంటే కేటీఆర్, కవితలకు చాలా ఇష్టం. ఇప్పటికీ చిరునే నా ఫేవరెట్ హీరో అని కవిత చాలా సందర్భాల్లో చెప్పారు. కేటీఆర్ కూడా అంతే. రామ్‌చరణ్‌కి చాలా సన్నిహితుడు. అలాంటి కేటీఆర్‌కి.. చిరంజీవి `సారీ` చెప్పారు. అదీ తెలుగులో! వివరాల్లోకి వెళ్తే… ఈమధ్య కేటీఆర్‌కి పలు అంతర్జాతీయ అవార్డులు అందాయి. ఈ విషయం తెలుసుకొని చిరంజీవి కేటీఆర్‌కి ఫోన్ల్లో `కంగ్రాట్స్` చెప్పారు. దానికి కేటీఆర్… ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుతున్నప్పుడు.. ఇంగ్లీష్‌లో అభివందనాలేందన్నా… అన్నార్ట. దానికి చిరంజీవి మనస్సు చివక్కుమందట. వెంటనే తెలుగులో క్షమాపణలు చెబుతూ… తన తదుపరి ప్రసంగాన్నంతా తెలుగులోనే చేశార్ట. ఈ విషయాన్ని చిరంజీవినే గుర్తు చేసుకొన్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహాసభలకు చిత్రసీమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవిని సత్కరించారు. దానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తూ… ఆ మాటల సందర్భంలో కేటీఆర్‌తో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. తెలుగు మహాసభలు చాలా ఘనంగా జరుగుతున్నాయని, ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ తెలుగుని తప్పని సరి చేయడం ఈ భాషపై కేసీఆర్‌కు ఉన్న మమకారం కారణమని కొనియాడారు చిరంజీవి. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఆయన పంచె కట్టుకొని అచ్చ తెనుగు అవతారంలో రావడం సభికుల్ని ఆకట్టుకుంది.