‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేష్ పాడిన పాట జనాల్లోకి వెళ్ళింది. ఆ పాట సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ లో బాగా ఉపయోగపడింది. ఇప్పుడు చిరంజీవి తో సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. దాదాపుగా సంక్రాంతికి వస్తున్నాం టీమే సినిమాకి పని చేస్తుంది. బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా కోసం అనిల్ చిరంజీవితో ఓ పాట పాడించాలనే ప్లాన్ తో వున్నారు. ఇందుకు చిరంజీవి కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటినుంచే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. చిరుని అందులో భాగం చేశారు. టెక్నికల్ టీంని ఓ వినూత్న వీడియో ద్వారా పరిచయం చేశారు. ఈ వీడియోలో అందరినీ పలకరించి చిరు హుషారుగా కనిపించారు.
ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే తపన చిరులో కూడా వుంది. అందులో భాగంగానే పాడాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అన్నట్టు.. చిరంజీవి పాట పాడటం కొత్త కాదు. మృగరాజు సినిమాలో చిరు పాడిన చాయ్ పాట అప్పట్లో చాలా ఆదరణ పొందింది.