శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న బ్రూస్లీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. బ్రూస్లీ సినిమాలో చిరంజీవి కూడా మూడు నిమిషాలపాటు అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ఇరువురి మధ్య సాగే డైలాగ్స్ ని చెప్పి అభిమానులకు ఆనందపరిచారు.
రామ్ చరణ్ తేజ్: “బాస్! మీ స్టామినాను, స్పీడ్ ను అందుకోవడం కష్టం!”
చిరంజీవి: నా స్టామినాకి, స్పీడుకి ఫ్యూయల్ నా అభిమానులే…మన అభిమానులే. నా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళకోసం వెళుతున్నా..బై”
చిరంజీవి ఈ డైలాగ్స్ చెప్పగానే అభిమానులు ఎంతగా మురిసిపోయుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇక సినిమా హాల్లో ఎలాగా ఉంటుందో…