చారిత్రక నేపథ్యం ఉన్న కథా చిత్రాలకు లొకేషన్లతో సమస్య వస్తుంటుంది. ఆ నాటి కాలాన్ని అచ్చంగా ప్రతిబింబించడం చాలా కష్టం. అందుకోసం సెట్స్‌ని ఆశ్రయిస్తారు. సహజమైన లొకేషన్లలో చిత్రీకరించడం చాలా అరుదు. ప్రస్తుతం `సైరా`కి లొకేషన్ల సమస్య వచ్చింది. ఇప్పటి వరకూ తీసిన సన్నివేశాలన్నీ సెట్స్‌లోనే. ఇప్పుడు తొలిసారి అవుడ్డోర్ వెళ్లబోతోంది ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ త్వరలో జార్జియాలో మొదలుకాబోతోంది. అక్కడ 20 రోజుల పాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఇది వరకు జార్జియాలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ షూటింగ్ జరిగింది. అది కూడా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమానే. క్రిష్ అండ్ కో.. ఎంతో రిసెర్చ్ చేసి ఆ లొకేషన్లను పట్టుకున్నారు. ఇప్పుడు అవి ‘సైరా’కి ఉపయోగపడుతున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం, బ్రిటీష్ ఆఫీసర్లు వాళ్లకు సంబంధించిన సన్నివేశాల్ని జార్జియాలో తెరకెక్కిస్తారు. బ్రిటీష్ సైనికులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే సన్నివేశాల్ని అక్కడ తెరకెక్కిస్తారు. తిరిగి వచ్చాక.. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలెడతారు. మరి `సైరా` కోసం చిరు అండ్ కో ఎప్పుడు జార్జియా వెళ్తారు? చిరుతో పాటు ఇంకెవరు ఈ టీమ్‌లో ఉంటారు? అనేది తెలియాల్సివుంది.