చిరంజీవి 151 వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మాణం మంచి ప్రయత్నమే. ఇది చక్కగా రావాలని కోరుకోవాలి. అయితే ఈ సమయంలో తప్పక తల్చుకోవలసిన పేరు కర్నూలుకు చెందిన రచయిత ఎస్డివిిఅజీజ్ది. స్వంతంగా అనేక ఇబ్బందులు పడి ఉయ్యాల వాడ వివరాలు సేకరించి పాలెగాడు అనే నవల రాసిన వ్యక్తి అజీజ్, తర్వాత దాన్ని రెండవ ముద్రణ కూడా తీసుకొచ్చారు. ఉయ్యాలవాడ పేరు వినగానే ఆ నవలే గుర్తుకు వస్తుంది. ఎవరు ఎంత వాడుకున్నారనేది అలా వుంచితే ఒక వనరుగా ఎవరైనా చూస్తారు. విశాలాంధ్ర వారు కూడా దాన్ని పునర్ముద్రించారు. ఈ చిత్ర నిర్మాణం గురించి విని అజీజ్ తనకు తెలిసిన వారితో సంప్రదిస్తే సెట్స్ మీదకు వెళ్లినప్పుడు చూద్దామన్నారట. మరి ఇప్పుడు లాంఛనంగా మొదలవుతుంది గనక ఆ రచయితకు కూడా చిరంజీవి కుటుంబం నుంచి ఆదరణ లభిస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఈ భారీ బడ్జెట్ల యుగంలో అలాటివి పెద్ద లెక్కలోకి వచ్చే మొత్తాలుగా వుండవు కదా… అది సహృదయ సంప్రదాయంగానూ వుంటుంది.