‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు మెగాస్టార్ చింజీవి. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో వుండటంతో బాలీవుడ్ కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఛానల్‌తో చిరు మాట్లాడారు. ఈ సందర్భంగా రాజమౌళితో సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ప్రశ్నకు చిరు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
‘‘రాజమౌళి గొప్ప దర్శకుడు. ఇండియన్ సినిమాని ప్రపంచస్థాయికి చాటారు. ఆయన ప్రతి విషయాన్నిఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ను ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఇక సినిమా తెరకెక్కించటానికి తను ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని లేదు’’అని చెప్పుకొచ్చారు చిరు.